Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Sagittarius

ధనుస్సు

అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయడం కష్టసాధ్యంగా మారుతుంది.

మీ సహాయసహకారాలు పొందిన వారు కూడా సమయానికి  రిక్తహస్తాలు చూపవచ్చు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

స్నేహితులు శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులు పెరిగి రుణాలు చేస్తారు.

అవసరాలకు ఇతరుల పై ఆధారపడాల్సివస్తుంది.

ఆస్తుల విక్రయాలు కూడా నిలిచిపోయి మరింత ఇబ్బంది కలిగిస్తాయి.

కుటుంబంలో మీరు ఎంతగా ఆదరణ చూపినా కుటుం బసభ్యులు పట్టించుకోరు.

సంతానపరంగా కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు.

భార్యాభర్తల మధ్య అపార్థాలు నెలకొంటాయి.

ప్రతి విషయంలోనూ కొంత నిదానం పాటించడం మంచిది.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తరచూ ఏదో ఒక రుగ్మతలు బాధపెట్టవచ్చు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే.

పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి.

ఉద్యోగాలలో మార్పులు తప్పకపోవచ్చు.

బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces