Weekly Horoscope
1st December, 2019 to 7th December, 2019
Sagittarius
ధనుస్సు
ఎంత కష్టపడ్డా ఫలితం ఉండనిస్థితి.
మీ ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.
మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.
కాంట్రాక్టర్లకు శ్రమానంతరం అవకాశాలు దక్కుతాయి.
చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి.
సభలు,సమావేశాలలో పాల్గొంటారు.
ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు చికాకు పరుస్తాయి.
విద్యావకాశాలు విద్యార్థులకు కొంత ఊరటనిస్తాయి.
ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలు తీరక అప్పులు చేస్తారు.
ఆస్తుల విక్రయాలు సకాలంలో జరిగినా డబ్బు అందడంలో జాప్యం.
ఖర్చులు కూడా మీదపడతాయి.
కుటుంబం లో అందరితోనూ సఖ్యంగా ఉండాలని భావించినా అవతలి నుంచి సానుకూలత కనిపించదు.
మీ పై నెపాలు మోపేదేందుకు బంధువులు సైతం వెనుకాడరు.
సంతానపరంగా చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి.
ఆరోగ్యం గతం కంటే కొంత మెరుగుపడి ఊరట చెందుతారు.
వ్యాపారాల లో ఆశించిన లాభాలు కష్టమే.
పెట్టుబడుల్లో తొందరవద్దు.
ఉద్యోగాల లో కొన్ని మార్పులకు సిద్దపడాలి.
పనిభారం పెరుగుతుంది.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.
మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.