Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Sagittarius

ధనుస్సు

మొదట్లో మానసిక అశాంతి, సమస్యలు చికాకు పరుస్తాయి.

అయితే క్రమేపీ వీటిని అధిగమించి అడుగువేస్తారు.

చేపట్టిన కార్యక్రమాలు కొంత కష్టమైన పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

పలుకుబడి, హోదాలు కలిగిన వారు సహాయపడతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిత్రవిచిత్ర సంఘటనలతో ఆశ్చర్యపోవడం మీవంతు.

ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి.  

రావలసిన పైకం ఆందుతుంది.

అలాగే, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో మీ పై ఇంతకాలం అభాండాలు మోపిన వారే ప్రశంసిస్తారు.

దూరపు బంధువులతో ముఖ్య విషయాల పై చర్చిస్తారు.

వివాహ వేడుకలకు ఏర్పాట్లలో మునిగి తేలతారు.

ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

భాగస్వాములతో మాటపట్టింపులు.

ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు.

బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కాస్త అనుకూల సమయమనే చెప్పాలి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces