Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Sagittarius

ధనుస్సు

అనుకున్న పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో అకారణంగా తగాదాలు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ప్రత్యర్థులు మీపట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు.

కాంట్రాక్టులు చేజారవచ్చు.

తీర్థ యాత్రలు చేస్తారు.

ఆర్థికం....కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సమయానికి డబ్బు అందక నిరాశ చెందుతారు.

రుణ దాతలు మరో వైపు ఒత్తిడులు పెంచుతారు.

సోదరులతో కలహాలు. మీ శ్రమను కుటుంబ సభ్యులు గుర్తించక పోవడంతో మదనపడతారు.

ఆరోగ్యంపరమైన రుగ్మతలతో బాధపడతారు.

వైద్య సేవలు అవసరం కావచ్చు.

వ్యాపారాలు, క్రమేపీ లాభిస్తాయి. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు సంభవం.

విధుల్లో అవాంతరాలు ఎదురవుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.

మహిళలకు మానసిక ఆందోళన.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces