Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Sagittarius

ధనుస్సు

వారమంతా మీదే పై చేయిగా ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలించి ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు.

కొత్త వ్యక్తులు అనూహ్యంగా సహకరిస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు కాస్త ఊరట చెందే సమాచారం అందుకుంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.

ఇంతకాలం డబ్బు కోసం పడిన అవస్థలు తొలగుతాయి.

రుణ బాధలు కూడా తొలగే సమయం.

కుటుంబ సభ్యులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు.

ఎటువంటి బాధ్యత అయినా అవలీలగా పూర్తి చేస్తారు.

విదేశాలలో ఉన్న వారి క్షేమ సమాచారం ఊరట కలిగిస్తాయి.

కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

కొత్త భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు.

ఉద్యోగస్తులు విధుల్లో మీ సత్తా చాటుకుంటారు.

పై స్థాయి వారి నుంచి సహాయం అందుకుంటారు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి.

మహిళలకు సమస్యలు, చికాకులు తొలగుతాయి.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

కాలభైరవాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces