Weekly Horoscope

17th December, 2017 to 23rd December, 2017

Scorpio

వృశ్చికం

పరపతి కలిగిన వారితో పరిచయాలు.

సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.

పాతబాకీలు వసూలవుతాయి.

గతంలో నిలిచిపోయిన పనులు సైతం ప్రస్తుతం పూర్తి చేస్తారు.

బంధువులతో మంచీచెడ్డా విచారిస్తారు.

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

దేవాలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి లాభం.

గృహ నిర్మాణాలు  చేపట్టే వీలుంది.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు అందుతాయి.

లైసెన్సులు పొందుతారు.

రాజకీయవేత్తలకు పదవులు, హోదాలు దక్కుతాయి.

కళాకారులకు సన్మానాలు, అవార్డులు అందుతాయి.

విద్యార్థులూ పోటీపరీక్షల్లో విజయం మీదే.

ఐటీ రంగం వారికి ఊహించని విధంగా మీ హోదాలు పెరుగుతాయి.

వ్యవసాయదారులు కొత్త అంచనాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

విశాఖ 4వ పాదం వారికి సోమవారం అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గురువారం విందువినోదాలు. కార్యసిద్ధి.

అనూరాధ వారికి ఆదివారం వివాదాలు. చర్చలు అనుకూలించవు. అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. కార్యసిద్ధి.

జ్యేష్ఠ వారికి మంగళవారం ఆస్తి వివాదాలు. చోర భయం. కుటుంబంలో సమస్యలు. గురువారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవస్తో త్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces