Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Scorpio

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

బంధువులతో అకారణంగా తగాదాలతో మానసిక ఆందోళన చెందుతారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి.

మిత్రుల సహాయం కోరతారు.

కొన్ని విషయాలలో ఇతరులకు తలవంచక తప్పని పరిస్థితి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుటుంబసభ్యుల నిర్ణయాలు వ్యతిరేకిస్తారు.

పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి.

వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. 

ఉద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

మహిళలకు ఒడిదుడుకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

విశాఖ 4వ పాదం వారికి  మంగళవారం మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. శుక్రవారం ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యజయం.

అనూరాధ వారికి ఆదివారం వివాదాలు. ధన వ్యయం. బంధువిరోధాలు. బుధవారం యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి.

జ్యేష్ఠ వారికి బుధవారం వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. శుక్రవారం విందువినోదాలు. వాహనయోగం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces