Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Scorpio

వృశ్చికం

మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించే సమయం.

ఆప్తులు, శ్రేయోభిలాషుల ప్రేమను పొందుతారు.

వివాహ, ఉద్యోగయత్నాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారి కష్టసుఖాలలో భాగస్వాములవుతారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

రుణబాధలు తొలగుతాయి.

సోదరుల నుంచి ధనలాభ సూచనలు.

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

సంతానరీత్యా మరింత ఉత్సాహంగా ఉంటుంది.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత.

అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు.

జీవితాశయం నెరవేరే దిశగా అందరి సలహాలు స్వీకరిస్తారు.

కొంతకాలంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఔషధ సేవనానికి స్వస్థి.

వ్యాపారాల విస్తరణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగాలలో విధుల్లో ఆటంకాలు, చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. పై స్థాయి వారి మెప్పు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు విదేశీ సంస్థలతో భాగస్వాములవుతారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు

మహిళలకు మానసిక ప్రశాంతత.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces