Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Scorpio

వృశ్చికం

మీరు ఊహించిన విధంగానే వ్యవహారాలు పూర్తి కాగలవు.

ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు.

కొన్ని చిక్కులు, వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ఎంతటి వారినైనా ఆకట్టుకుని వారి సహాయం పొందుతారు.

కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరే సమయం.

భూములు, వాహనాలు కొనుగోలుకు అవకాశాలున్నాయి.

విద్యార్థులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

మీ సంకల్ప బలం ఎంత గొప్పదో ఈవారం రుజువు కాగల సూచనలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

కొంత సొమ్ము అనుకోకుండా లభిస్తుంది.

అవసరాలకు లోటు లేకుండా గడుస్తుంది.

రుణ బాధలు చాలావరకూ తీరతాయి.

ఆస్తులు, షేర్ల విక్రయాల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది.

కుటుంబంలో శుభకార్యాలతో సందడిగా ఉంటుంది.

సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు.

సంతానపరంగా నెలకొన్న కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

పెద్దల ఆరోగ్యం మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు.

స్వల్ప అనారోగ్యం, ఔషధ సేవనం.

వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. అయితే భాగస్వాములు కొంత బెట్టు చేయడంతో వేగం తగ్గిస్తారు.

విస్తరణలో నిదానంగా ముందుకు సాగుతారు.

ఉద్యోగాలలో పైస్థాయి వారి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

మీ పని విధానం నచ్చి ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సంతోషకరమైన కాలం. పట్టింది బంగారమే.

మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces