Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Scorpio

వృశ్చికం

అనుకున్న ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి.

స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కొన్ని సమస్యలు తప్పవు.

కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

చిరకాల ప్రత్యర్థులు మీకు మరిన్ని సమస్యలు సృష్టించే వీలుంది.

ఆస్తి వివాదాలు నెలకొని ఇబ్బంది పడతారు.

విద్యార్థులు కొంత కష్టపడితే మేలు, మంచి ఫలితాలు రాబడతారు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.

ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా అవసరాలు తీరక ఇబ్బందిపడతారు. రుణాలు చేస్తారు.

ఇతరుల నుంచి సైతం బాకీలు పెండింగ్‌లో పడతాయి.

మొత్తం మీద ఖర్చులు కూడా అధికమవుతాయి.

మీపై కుటుంబ సభ్యులు కొన్ని విమర్శలు చేయడం నిరాశ పరుస్తుంది.

బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

సంతానపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురైనా పరిష్కరిస్తారు.

కొన్ని వేడుకలను వాయిదా వేసుకుంటారు.

ఒకరి ఆరోగ్య పరిస్థితి గందరగోళపర్చినా సద్దుకుంటుంది.

ఆరోగ్యం కొంత అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటారు.

వ్యాపారాలలో సామాన్య లాభాలు దక్కించుకుంటారు.

భాగస్వాములతో మాటపట్టింపుల వల్ల కొంత మందగిస్తాయి.

ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు దక్కక డీలాపడతారు.

పారిశ్రామికవేత్తలు,కళాకారులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు.

మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces