Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Scorpio

వృశ్చికం

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురుకావచ్చు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

స్నేహితుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

కష్టపడ్డా ఫలితం కనిపించదు.

నిర్ణయాలు తరచూ మార్చుకుంటారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆర్థికంగా ఆదాయవ్యయాల మధ్య పొంతన ఉండదు.

కొత్త రుణాలు చేస్తారు.

ఆస్తుల విక్రయాలు జరిగినా సొమ్ము అందడంలో జాప్యం.

షేర్లలో పెట్టుబడులపై తొందర వద్దు.

బంధువులు మీపట్ల కొంత వ్యతిరేకత చూపుతారు.

మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు.

కొన్ని వేడుకలు రద్దు చేసుకుంటారు.

మొత్తం మీద ప్రతివిషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి.

పెట్టుబడుల్లో ఆటంకాలు.

ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. పైస్థాయి వారి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల సమయం.

మహిళలకు సోదరీలతో వివాదాలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces