Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Scorpio

వృశ్చికం

అనుకున్న పనుల్లో జాప్యం తప్పదు.

ఎంత కష్టించినా ఫలితం కనిపించని పరిస్థితి.

మిత్రులతో విభేదాలు నెలకొంటాయి.

ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.

ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదాపడవచ్చు.

తీర్థ యాత్రలు చేస్తారు.

చీటికీ మాటికీ సమస్యలు ఎదురుకావచ్చు.

నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు.

కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు.

ఇళ్లు,వాహనాల కొనుగోలులో ఆటంకాలు ఎదురవుతాయి.

కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తులు, షేర్ల విక్రయాలు జరిగినా సకాలంలో డబ్బు అందక ఇబ్బంది పడతారు.

చిన్న అవసరానికి కూడా ఇతరుల పై ఆధారపడాల్సి వస్తుంది.

కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపార్ధాలు నెలకొంటాయి.

బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

బంధువుల నుంచి అందిన సమాచారం నిరుత్సాహపరుస్తుంది.

ఆరోగ్యపరమైన  రుగ్మతలు తరచూ బాధిస్తాయి.

వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు కనిపించినా పెట్టుబడుల్లో నిరాశ తప్పదు. భాగస్వాములతో మాటపట్టింపులు.

ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు.

విధి నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు గందరగోళంగా ఉంటుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ పంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces