Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Scorpio

వృశ్చికం

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు.

ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో వివాదాలు తీరతాయి.

ఆస్తుల  కొనుగోలులో అవాంతరాలు సైతం తొలగుతాయి.

వాహన యోగం.

పరిచయాలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలలోనూ పరిచయాలు ఏర్పడే అవకాశం.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ఆర్థికపరంగా మధ్యలో కొంత ఇబ్బంది కలిగినా అధిగమిస్తారు.

ఏదో విధంగా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆస్తుల విక్రయాలలో ప్రతిష్ఠంభనతో ఇటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు.

కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు అమలు చేస్తూ ముందుకు సాగుతారు.

సోదరులు, సోదరీలతో కొన్ని విషయాలలో సర్దుకుపోతారు.

సంతానం వివాహ విషయం కొలిక్కి వస్తుంది.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్య సేవలు తగ్గిస్తారు.

వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా సాగుతారు.

కొత్త భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో మీ సత్తా, ప్రతిభ పై స్థాయి వారు గుర్తిస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకోని పిలుపులు, ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆంజనేయ దండకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces