పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Taurus

వృషభం..

అదనపు ఆదాయం సమకూరుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉత్సాహంగా ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూరి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కళాకారులు, రియల్‌ఎస్టేట్‌ల వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు. కృత్తిక 2,3,4పాదాల వారికి సోమవారం వివాదాలు. అనుకోని ఖర్చులు. బుధవారం భూలాభాలు. బాకీలు వసూలవుతాయి. రోహిణి వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. మృగశిర 1,2పాదాల వారికి సోమవారం కీలక నిర్ణయాలు. కార్యజయం. బుధవారం పనులలో ఆటంకాలు. దుబారా వ్యయం.

తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. నృసింహస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces