Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Taurus

వృషభం

అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి చేస్తారు.

అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు.

మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.అభిమానం, ఆదరణ కనబరిచి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

ఓర్పుతో సమస్యల నుంచి బయటపడతారు.

విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఇతరుల నుంచి సైతం ధనలాభాలు కలుగుతాయి.

రుణబాధలు తొలగుతాయి.

తండ్రి తరఫు వారితో ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి.

కుటుంబంలో సంతానపరంగా ముఖ్యంగా తృతీయ సంతానరీత్యా శుభవార్తలు.

సహాయసహకారాలు అందుతాయి.

శుభకార్యాల సందడి నెలకొంటుంది.

సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

కొద్దిపాటి రుగ్మతలు బాధించినా ఉపశమనం లభిస్తుంది. ఔషధసేవనం కొనసాగిస్తారు.

వ్యాపారాలలో అనుకున్నరీతిలో పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాముల నుంచి పూర్తి సహాయం అందుతుంది.

మీ వ్యూహాలు ఫలిస్తాయి.

ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. ఉన్నతాధికారుల నుంచి ఉపకారం పొందుతారు.

రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు.

మహిళలకు మానసిక ప్రశాంతత.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces