Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Taurus

వృషభం

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మిత్రుల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

కొత్త కాంట్రాక్టులు సైతం  పొందుతారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

కొన్ని సమస్యలు వాటంతట అవే సద్దుబాటు కాగలవు.

ఆలోచనలు అమలు చేస్తారు.

కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది.

ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము అందుతుంది.

మీరు హామీలు ఉండి స్నేహితులకు ఇప్పించిన రుణాలు సైతం తీరి ఊరట చెందుతారు.

ఆస్తులు, షేర్ల క్రయవిక్రయాలు లాభించి కొంత సొమ్ము అందుకుంటారు.

మీ ప్రేమను కుటుంబ సభ్యులందరి తో పంచుకుంటారు.

వేడుకల నిర్వహణలో నిమగ్నమవుతారు.

సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.

తల్లిదండ్రుల మాటను జవదాటక కొన్ని విషయాలలో రాజీపడతారు.

ఆరోగ్య సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.

వ్యాపారాలు మరింత  ఆశాజనకంగా సాగుతాయి.

కొత్త పెట్టుబడులు అందుతాయి.

భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఉద్యోగస్తులు విధి నిర్వహణలో చికాకులు తొలగి ఊరట చెందుతారు.

పారిశ్రామికవర్గాలు, కళాకారులకు మరిన్ని విజయాలు చేకూరతాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు సానుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces