Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Taurus

వృషభం

ఎంతగా కష్టపడ్డా అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేక డీలాపడతారు.

మిత్రులు, సన్నిహితులతో అకారణంగా తగాదాలు.

మీ సహాయం పొందిన వ్యక్తులు సైతం ముఖం చాటేస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురై నిరాశ చెందుతారు.

విద్యార్థుల శ్రమ కొంత వృథా కాగల సూచనలు.

అయితే పట్టుదల వీడవద్దు.

కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు జారవిడుచుకుంటారు.

ఇతరుల నుంచి రావలసినది, ఆస్తుల విక్రయాల ద్వారా అందాల్సిన సొమ్ము సైతం సకాలంలో రాక ఇబ్బంది పడతారు.

ఇతరులకు ఇచ్చిన హామీలకు చెల్లింపుల విషయంలో ఒత్తిడులు ఎదురవుతాయి.

అయితే చివరిలో ఆశారేఖలు చిగురిస్తాయి. స్వల్ప మొత్తాలు రావచ్చు.

కుటుంబంలో మీ సలహాలు, సూచనలు తిరస్కరిస్తారు.

సోదరులతో విభేదాలు నెలకొంటాయి.

ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి ముందుకు సాగండి.

కొన్ని వేడుకులను వాయిదా వేస్తారు.

సంతానం నుంచి కొన్ని ఇబ్బందులు తప్పవు.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.

అయితే వైద్య సేవలు తప్పక పోవచ్చు.

వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి.

ఆశించిన లాభాలు కనిపించక అయోమయంలో పడతారు.

ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సహచరుల సహాయం కోరతారు.

పని ఒత్తిడులు పెరుగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు మానసిక అశాంతి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ ఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces