Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Taurus

వృషభం

కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతారు.

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

ఆలోచనలు మొదట్లో కలసి రాకపోయినా క్రమేపీ మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఎంతో కాలంగా ఊరిస్తున్న ఉద్యోగాలు పొందుతారు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి.

కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.

విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

తీర్థయాత్రలు విరివిగా చేస్తారు.

ఆర్థిక అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది.

మధ్యమధ్యలో కొంత ఇబ్బంది కలిగినా లోటు రాదు.

భూముల విక్రయాల ద్వారా మరింత ధనలబ్ధి కలుగుతుంది.

ఇతరులకు హామీలిచ్చే సందర్భంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

కుటుంబంలో మీపై ప్రేమాభిమానాలు మరింత కనిపిస్తాయి.

అందరికీ తలలో నాలుకగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.

భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.

సంతానంలోని ఒకరి వివాహ విషయం ఖరారు చేస్తారు.

స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుతాయి.

ఊహించని రీతిలో భాగస్వాముల నుంచి పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు.

పనిభారం చాలావరకూ తగ్గుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces