Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Taurus

 

వృషభం

ప్రారంభంలో కొన్ని వివాదాలు తలనెప్పిగా మారవచ్చు.

అయితే క్రమేపీ అధిగమించి ముందుకు సాగుతారు.

తరచూ తీర్థయాత్రలు చేస్తారు.

ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.

చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు.

కాంట్రాక్టులు పొందుతారు.

జీవితాశయం నెరవేరుతుంది.

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.

ఆర్థికంగా సొమ్ముకు లోటు లేకుండా ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరతాయి.

షేర్లలోనూ పెట్టుబడులకు సంసిద్ధులవుతారు.

అయితే ఆర్థిక పరమైన హామీలు వద్దు.

కుటుంబంలో మీరంటే అంతా మరింత ఇష్టపడతారు. నిర్మొహమాటంగా మనస్సులోని భావాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.

శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.

సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది.

సంతానం ఉద్యోగావకాశాలు సఫలమై ఉత్సాహంతో గడుపుతారు.

ఆరోగ్యం కొంత నలత చేసినా సర్దుబాటు కాగలదు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces