Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Taurus

వృషభం

అనుకున్న కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు.

మీ మాటకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

అందరిలోనూ ప్రత్యేక గౌరవం, ఆదరణ పొందుతారు.

చిరకాల ప్రత్యర్థులు సైతం మీ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు.

తరచూ తీర్థయాత్రలు చేస్తారు.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

నిరుద్యోగులు, విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

డబ్బుకు లోటులేకుండా గడుస్తుంది.

కొన్ని రుణాలు కూడా తీరతాయి.

షేర్లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కలుగుతాయి.

మొత్తం మీద అవసరాలకు ఏమాత్రం ఇబ్బంది కలుగదనే చెప్పాలి.

కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వివాహాది వేడుకులు నిర్వహిస్తారు.

సోదరులు,సోదరీలతో మరింత సఖ్యత నెలకొని ఉత్సాహంతో సాగుతారు.

ఆస్తుల పంపకాలలో నెలకొన్న ఇబ్బందులు సైతం తొలగుతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊపిరి పీల్చుకుంటారు.

వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతారు. నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగస్తులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు స్వల్ప ధన, లేదా ఆస్తిలాభ సూచనలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces