Weekly Horoscope
1st December, 2019 to 7th December, 2019
Taurus
వృషభం
దూరమైన కొందరు ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు.
ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.
ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది.
విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి.
చిరకాల ప్రత్యర్థులు కూడా మీ వాదనలు, అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అలాగే, స్నేహ హస్తం అందిస్తారు.
వాహనాలు, గృహం కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.
ఆర్థికపరం గా రావలసిన డబ్బు కొంత జాప్యం జరిగినా అందుతుంది.
దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.
ఆస్తుల కొనుగోలుకు డబ్బు వెచ్చిస్తారు.
సంతానపరంగా మరిన్ని శుభవార్తలు.
కుటుంబంలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
సోదరులతో మరింత సర్దుబాట్లు ఉంటాయి.
ఆరోగ్యపరం గా ఇంతకాలం పడుతున్న రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో లాభాలు మరింతగా అందుతాయి.
కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు.
భాగస్వాములతో వివాదాలు తీరతాయి.
ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి.
విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళలకు మరింత గౌరవం దక్కుతుంది.
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.
రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.