Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Virgo

కన్య

ఎంతగా కష్టపడ్డా ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిత్రులతో మాటపట్టింపులు.

మంచి చెప్పినా చెడుగా మారి శత్రువులు పెరుగుతారు.

ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది.

ఇంటి నిర్మాణాల్లో ప్రతిష్ఠంభన నెలకొంటుంది.

కాంట్రాక్టులు చివరిక్షణంలో చేజారవచ్చు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు కష్టసాధ్యమే.

ఆర్థికంగా కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడక అప్పులు చేస్తారు.

అయితే ఖర్చుల విషయంలో నిదానం పాటించండి.

ఇతరులకు హామీల విషయంలో తొందరపాటు వద్దు.

కుటుంబంలో కొన్ని వివాదాలు నెలకొని బంధువులతో సఖ్యత దెబ్బతింటుంది.

అయినా వాటిని అధిగమించేందుకు యత్నిస్తారు.

సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురై సహనానికి పరీక్షగా నిలుస్తాయి.

మీ ఆభిప్రాయాలను కుటుంబసభ్యుల కోరిక మేరకు మార్చుకుంటారు.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.

వ్యాపారాలలో మొదట్లో కొంతమేర లాభించినా క్రమేపీ నిరాశ చెందుతారు.

భాగస్వాములు ఒత్తిడులు పెంచుతారు.

ఉద్యోగాలలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు, సమర్థతను చాటుకునేందుకు శ్రమపడాలి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొత్త సమస్యలు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces