Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Virgo

కన్య

అన్ని సమస్యల నుంచి దాదాపు గట్టెక్కుతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు తగిన వాతావరణం ఉంటుంది.

ఆత్మీయుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది.

విద్యార్థుల ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది.

చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

మీ పై వచ్చిన అభాండాలు తొలగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది.

దీర్ఘకాలిక రుణాలు కూడా తీరతాయి.

స్థిరాస్తుల విక్రయాలు కూడా సకాలంలో పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు. మొత్తంమీద ఆశాజనకంగా ఉంటుంది.

ఇంట్లో వివాహాది వేడుకల నిర్వహణతో సందడిగా గడుపుతారు.

అందరి ఆదరణ పొందుతారు.

పెద్దల సలహాలు తూచ తప్పకుండా పాటిస్తారు.

సంతానంలోని ఒకరి ఆరోగ్య సమస్యలు తీరతాయి.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్యసేవల నుంచి విముక్తి.

వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు కూడా సంతృప్తినిస్తాయి.

ఉద్యోగస్తుల విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉన్నత పోస్టులు దక్కే అవకాశం.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces