Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Virgo

కన్య

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆత్మీయల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు.

ఆశ్చర్యకరమైన రీతిలో  శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. అప్పులు తీరతాయి.

అలాగే, రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి.

ఆస్తుల విక్రయాలు సమయానికి పూర్తి చేసి మరింత సొమ్ము అందుకుంటారు.

కుటుంబంలో భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు తొలగుతాయి. సంతానపరంగా చిక్కులు తొలగుతాయి.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

మీ అభిప్రాయాలను అందరూ గౌరవించడం ఉత్సాహాన్నిస్తుంది.

ఆరోగ్యం కొంత నలత చేసి ఇబ్బంది పడతారు.

అయినా దినచర్యలు యథాతథంగా కొనసాగిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంతో సాగుతారు.

భాగస్వాముల అభిప్రాయాలతో ఏకీభవించి పెట్టుబడులు అందుకుంటారు.

ఉద్యోగాలలో ఆశించిన మేరకు పదోన్నతులు దక్కుతాయి.

విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces