Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Virgo

కన్య

కొత్త వ్యవహారాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

మీ యుక్తితో ఎదుటి వారి సమస్యలు సైతం పరిష్కరిస్తారు.

ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత బయటపడతారు.

మీ నిర్ణయాలు మిత్రులు స్వాగతిస్తారు.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలలో పురోగతి ఉంటుంది.

కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.

విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది.

సొమ్ములు అంది అవసరాలు తీరతాయి.

షేర్ల విక్రయాలు ఎట్టకేలకు పూర్తి చేసి కొంత డబ్బు అందుకుంటారు.

కుటుంబంలో అందరితోనూ ప్రేమగా మసలుకుంటారు.

సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి.

మీ ఆప్యాయతకు బంధువులు పులకిస్తారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొంది ఊరట చెందుతారు.

కొత్త భాగస్వాములు చేరతారు.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు క్రమేపీ తొలగుతాయి.

విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం.

మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces