Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Aquarius

కుంభం

వీరికి గురువు ఏప్రిల్‌ 22వరకు లాభ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌ 4 వరకు దశమస్థానమైన వృశ్చికంలో సంచరించి తదుపరి లాభస్థానమైన ధనుస్సులో ప్రవేశించి సంవత్సరాంతం వరకూ సంచరిస్తాడు.

ఇక శని జనవరి 23వరకు లాభస్థానంలో సంచరించి తదుపరి వ్యయస్థానమైన మకరరాశిలో ప్రవేశిస్తాడు. ఇప్పటి నుంచి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది. రాహువు ఏడాదంతా పంచమమైన మిథునం, కేతువు లాభస్థానమైన ధనుస్సులో సంచారం.

వీరికి గ్రహస్థితి అంతా అనుకూలమైనదే. గురు, శని, కేతువు,రాహువులు సంవత్సరమంతా శుభులే. జనవరి 24నుంచి వీరికి ఏల్నాటి శని ప్రారంభమవుతుంది.

మొత్తం మీద వీరు విజయాలు, అభివృద్ధి వైపు పరుగులు తీస్తారు.

ఏ కార్యం తలపెట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు.

ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అవసరానికి మించి డబ్బు అందుతుంది. జ్ఞాతుల ద్వారా ధన లాభాలు.

ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేస్తారు.

వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికంగా చేస్తారు.

రాహువు పంచమ స్థితి కారణంగా సంతానం వల్ల కొద్దిపాటి సమస్యలు, ఒత్తిడులు ఉండవచ్చు.

నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు.

గత ఏడాది కంటే మరింత మెరుగుదల ఉంటుంది.

కోర్టు కేసులు పరిష్కారమై ఊరట చెందుతారు.

వ్యాపారులు అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. నూతన భాగస్వాములు చేరతారు.

ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. అవార్డులు లేదా పురస్కారాలు అందుకుంటారు.

పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం.

టీవీ, సినీకళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విశేష గుర్తింపు పొందుతారు.

విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు. అనుకున్న ఫలితాలు రాబడతారు.

వ్యవసాయదారులకు రెండుపంటలూ సానుకూలం.

క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాదులు ఐటీ రంగం వారు విజయాల వైపు సాగుతారు.

జనవరి 24 నుంచి ఏల్నాటి శని ప్రారంభం వల్ల మనోక్లేశాలు, వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు, కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు.

ఆదాయం –5, వ్యయం–2, రాజపూజ్యం–5, అవమానం–4.

వీరు జనవరి నుంచి శనీశ్వరునికి తైలాభిషేకాలు, జపాలు చేయించుకుంటే మంచిది.

అలాగే, ఆంజనేయస్వామిని పూజించండి.

వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు విశేష లాభదాయకమైనవి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces