పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Aries

మేషం

వీరికి సెప్టెంబర్‌12 నుంచి గురుడు శుభుడు. ఉగాది నుంచి సెప్టెంబర్‌ వరకూ గురు, రాహు, కేతువులు పాపులు. జూన్‌ నుంచి అక్టోబర్‌వరకు శని తిరిగి అష్టమ స్థానంలో సంచారం. మొత్తం మీద సెప్టెంబర్‌ నుంచి గురు బలం వల్ల అనుకూల స్థితి ఉంటుంది. ఈతి బాధలు, సమస్యల నుంచి కొంత వరకూ బయటపడతారు.సోదరులు, బంధువుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికపరమైన ఒత్తిడులు, అవసరాలు పెరుగుతాయి. అయితే హఠాత్తుగా సొమ్ము అందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చికాకులు తప్పక పోవచ్చు. ముఖ్యంగా ఎముకలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. నిరుద్యోగుల ఆశలు సెప్టెంబర్‌ నుంచి నెరవేరతాయి. మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం తో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి మీ అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సెప్టెంబర్‌ నుంచి  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి పరిశోధనలు ఫలించి గుర్తింపు రాగలదు.  వ్యాపారాలు కొంత వరకూ లాభిస్తాయి.పెట్టుబడుల విషయంలో కొంత నిదానం అవసరం. ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆగస్టు తరువాత ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది, కొత్త సంస్థలను ప్రారంభిస్తారు. రాజకీయవర్గాలకు ప్రధమార్థంలో సమస్యలు ఎదురైనా అక్టోబర్‌ నుంచి అనుకూల స్థితి. కళాకారులకు ఈ ఏడాది గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులకు రుణాలు, పెట్టుబడులు సమకూరతాయి. మొదటి పంట లాభదాయకం.  జూన్‌–నవంబర్‌ మధ్య కాలంలో  శని ప్రభావం (అష్టమంలో వక్రగతిన శని సంచారం) వల్ల కొన్ని ఇబ్బందులు, ఉద్యోగ మార్పులు, ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

పరిహారాలు...శని, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు పారాయణ చేయాలి.

అదృష్ట సంఖ్య–9,

ఆది, బుధ, గురువారాలు అనుకూలం.

ఆదాయం– 5 వ్యయం–5,

రాజపూజ్యం– 3 అవమానం–1

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces