Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Aries

మేషం

వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌ 22 వరకు భాగ్య స్థానం (9వ ఇంట) ధనుస్సులోనూ, ఏప్రిల్‌ 22న తిరిగి అష్టమ స్థానం (8వ ఇంట) లోకి ప్రవేశించి నవంబర్‌ 4వరకు సంచారం. తదుపరి సంవత్సరాంతం వరకూ భాగ్య స్థానంలో  సంచారం.

ఇక శని సంవత్సరాది నుంచి జనవరి 23వరకు ధనుస్సులోనూ, తదుపరి మకర రాశిలో సంచారం. రాహువు తృతీయమైన మిథునంకేతువు భాగ్య స్థానమైన ధనుస్సు రాశిలో   సంచారం

వీరికి కొంతవరకూ గురు బలం, సంవత్సరాంతంలో శని బలం ఉంటుంది. రాహు కేతువుల బలం లేదుఏప్రిల్‌నవంబర్‌ మధ్య కాలం మినహా గురుబలం, శనిబలం అధికం. ఇక రాహుకేతువుల స్థితి అంత అనుకూలం కాదు. మొత్తం మీద గత ఏడాదికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కొన్ని సమస్యలు తీరి ఒడ్డున పడతారు.

ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమించి ఉత్సాహంగా గడుపుతారు.

బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి.

కోర్టు కేసులు సుదీర్ఘ కాలం తరువాత పరిష్కారమయ్యే సూచనలు.

కుటుంబంలో  శుభకార్యాల నిర్వహణ.

క్లిష్టమైన పనులు సైతం మరింత  ఓపిగ్గా పూర్తి చేస్తారు.

వ్యాపారులకు అత్యంత లాభదాయకమైన కాలం. భాగస్వాములు మీ అభిప్రాయాలను మన్నిస్తారు.  కొత్త వ్యాపారాలు సైతం ప్రారంభిస్తారు. సంబంధిత అనుమతులు లభిస్తాయి.

ఉద్యోగస్తులు గత ఏడాదికంటే మరింత గుర్తింపు పొందుతారు. ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కవచ్చు.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఖాయం.

నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఊహించని విధంగా అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ వారికి గతం కంటె మెరుగ్గా ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలు లాభిస్తాయి.

ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో  కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు, విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రులు సందర్శిస్తారు.

కళాకారులకు కొత్త అవకాశాలు దక్కడంతో పాటు విదేశీ పర్యటనలు కూడా ఉంటాయి.

రాజకీయనేతలకు ఊహించని పదవీయోగాలు.

ఆదాయం–14, వ్యయం-14, రాజ్యపూజ్యం–3, అవమానం–7.

వీరు గురువు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు

గౌరీదేవికి కుంకుమార్చనలు శుభప్రదం.

ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసివస్తాయి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces