పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Cancer

కర్కాటకం

ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని మాత్రమే కొంత అనుకూలిస్తాడు. గురు, రాహు, కేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి సామాన్య ఫలితాలు ఉంటాయి. రాబడి ఉన్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. చేపట్టిన కార్యాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు ఎదురవుతాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సెప్టెంబర్‌తరువాత అనుకూలిస్తాయి. వాహనాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు ఆగస్టు తర్వాత ఫలిస్తాయి.  సెప్టెంబర్‌ నుంచి శుభకార్యాల హడావిడిలో నిమగ్నమవుతారు. ఆస్తుల వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. అయితే సెప్టెంబర్‌ నుంచి కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు సంభవం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఎదురైన సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాల వారికి జూన్‌ తరువాత అనుకూల పరిస్థితి. కొత్త పదవులు ఎట్టకేలకు సాధిస్తారు. కళాకారులు అనుకున్నది సాధించడంలో మరింత శ్రమపడాలి. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రెండవ పంట అనుకూలం. భాద్రపదం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు గురు, రాహు, కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. అలాగే, మాసశివరాత్రి రోజున శివునికి అభిషేకం, దుర్గ, సుబ్రహ్మణ్యేశ్వరుల ఆరాధన మంచిది.

అదృష్ట సంఖ్య –2, బుధ, శుక్ర, ఆదివారాలు అనుకూలం.

ఆదాయం–11, వ్యయం–8

రాజ పూజ్యం–5, అవమానం–4.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces