Yearly moonsign horoscope
06th April, 2019 to 24th March, 2020
Cancer
కర్కాటకం
ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ 22వరకు షష్ఠమ స్థానం ధనుస్సులోనూ, తదుపరి వృశ్చికంలో ప్రవేశించి నవంబర్ 4వరకు పంచమ స్థానంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ షష్ఠమమైన ధనుస్సు రాశిలో సంచారం
ఇక శని జనవరి 24వరకు షష్ఠమ స్థానమైన ధనుస్సులో, తదుపరి సంవత్సరాంతం వరకూ సప్తమమైన మకర రాశిలో సంచారం. రాహువు వ్యయంలోనూ, కేతువు షష్ఠమంలోనూ సంచారం.
వీరికి ద్వితీయార్థంలో గురుబలం అధికం. అలాగే, జనవరి వరకూ శని బలం ఉంటుంది. రాహుగ్రహ సంచారం వల్ల మానసిక ఆందోళన, తరచూ ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు వంటి ఫలితాలు ఉండవచ్చు.
ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేసి మీ సత్తా నిరూపించుకుంటారు.
ఆర్థికంగా చికాకులు ఎదురైనా తదుపరి పరిస్థితులు అనుకూలించి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు. అయితే తరచూ వృథా ఖర్చులు పెరుగుతాయి.
అనుకున్నది సాధించాలన్న తపన, పట్టుదలే మీ విజయాలకు బాటవేస్తాయి.
గతంలో కొన్ని సమస్యలు చికాకు పరచినా అనుభవాలతో ప్రస్తుతం వాటిని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు.
సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు.
ఆధ్యాత్మిక భావాలు పెరిగి మఠాలు, పీఠాల దర్శనాలు చేసుకుంటారు.
ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
చిత్రవిచిత్ర సంఘటనలు, సమాచారాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
వ్యాపారస్తులు అనుకున్న పెట్టుబడులు సమకూర్చుకుని లాభాల బాటపడతారు. కొత్త భాగస్వాముల సమీకరణలో విజయం సాధిస్తారు.
ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసి సమర్థతనను చాటుకుంటారు. ప్రమోషన్లు లభించి ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతిని సాధించి విశేష గుర్తింపు పొందుతారు.
రాజకీయవేత్తలకు మరింత ప్రజాదరణ లభిస్తుంది. కోరుకున్న పదవులు, హోదాలు దక్కే అవకాశం.
కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఊహించని అవార్డులు, పురస్కారాలు అందుతాయి.
సాహిత్యకారులు, జర్నలిస్టులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే.
వ్యవసాయదారులకు మొదటి పంట విశేషంగా లాభిస్తుంది.
ఏడాది చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అందోళన, శారీరక రుగ్మతలు వంటి బాధలు తప్పక పోవచ్చు.
ఆదాయం–5 వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–2
వీరు గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి.
అలాగే, దుర్గామాతకు అధికంగా కుంకుమార్చనలు చేయండి.
చైత్రం, జ్యేష్ఠం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.