Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Capricorn

మకరం

రాశి వారికి గురువు ఏప్రిల్‌ 22వరకు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌ 4వరకు లాభ స్థానం వృశ్చిక రాశిలో సంచరించి తిరిగి నవంబర్‌ నుంచి సంవత్సరాంతం వరకూ వ్యయస్థానమైన ధనుస్సులో సంచారం.

ఇక శని జనవరి 23వరకు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి జన్మరాశిలోనూ సంచారం. రాహువు సంవత్సరాంతం వరకు షష్ఠమైన కర్కాటకంలోనూ, కేతువు వ్యయ స్థానమైన ధనుస్సులోనూ సంచారం.

వీరికి ఏల్నాటి శని ప్రభావం అధికం. అయితే ఏప్రిల్‌ 22 నుంచి నవంబర్‌ 4వరకు లాభ గురువు యోగకారకుడు. రాహువు అనుకూలుడు. కేతువు అంతగా కలసిరాదు. జనవరి నుంచి శని జన్మరాశి సంచారం కారణంగా ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. అయినవారితో విభేదాలు నెలకొనవచ్చు. ఏ పనిపైనా శ్రద్ధ చూపరు.

మొత్తం మీద గురు బలం కాలంలో విశేష సంపదలు పొందుతారు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడుపుతారు. ఖర్చులు మీదపడినా అధిగమిస్తారు.

వివాహాది శుభకార్యాల నిర్వహణ.

సంతానపరంగా మరింత సౌఖ్యం.

జ్ఞాతుల ద్వారా ఆస్తి లేదా ధన లాభాలు కలుగుతాయి.

ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి.

సోదరులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

తీర్థ యాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.

మీ అభిప్రాయాలు, నిర్ణయాలు కుటుంబ సభ్యులకు శిరోధార్యంగా మారతాయి.

వ్యాపారస్తులు అనుకున్న విధంగా లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే ఛాన్స్‌. విశేష గుర్తింపు పొందుతారు.

పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైనరీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం సాధిస్తారు.

రాజకీయవేత్తలకు మరిన్ని పదవులు దక్కుతాయి. విశేష ప్రజాదరణ పొందుతారు.

కళాకారులు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. పురస్కారాలు, అవార్డులు రావచ్చు.

వైద్యులు, న్యాయవాదులు, ఐటీ రంగం వారికి మరింత అనుకూలత ఉంటుంది.

వ్యవసాయదారులకు రెండవపంట బాగా కలసి వస్తుంది.

ఆదాయం–5, వ్యయం–2, రాజపూజ్యం–2, అవమానం–4.

వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు,

ఆంజనేయస్వామికి అర్చనలు చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది.

చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces