Yearly moonsign horoscope

25th March, 2020 to 12th April, 2021

Capricorn

మకరం

ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.

ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య–8.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces