పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Gemini

మిథునం

ఈ రాశివారికి గురువు విశేష యోగకారకుడు. మిగతా గ్రహాల సంచారం సామాన్యం. మొత్తం మీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. రాబడి ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధువర్గం నుంచి విమర్శలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. అనుకున్న వ్యవహారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన హామీలు వద్దు. ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు అధిగమిస్తారు. ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు ఏర్పడినా క్రమేపీ అనుకూలత ఉంటుంది..ఇంటి నిర్మాణ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. శ్రావణం, ఆశ్వయుజ మాసాల్లో వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ఇతరుల  పొగడ్తలకు లొంగి పోవద్దు. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయితే ఆగస్టు నుంచి  ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో కొత్త పదవులు దక్కుతాయి.  కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు పెట్టుబడులు అందుతాయి. ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, మాఘ మాసాలు నెలలు అనుకూలం, మిగతావి సామాన్యం. వీరు శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.

అదృష్ట సంఖ్య 5, సోమ, గురు, శనివారాలు అనుకూలం.

రాహు, కేతువులకు పరిహారాలు శివాభిషేకాలు, దుర్గా స్తోత్ర పారాయణ చేయండి.

ఆదాయం–2, వ్యయం–11

రాజ పూజ్యం–2, అవమానం–4.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces