Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Gemini

మిథునం

ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–4, అవమానం–3

వీరికి గురుడు, శని బలం విశేషం. ఇక రాహు, కేతువులు దోషకారులు. ఈరీత్యా పరిశీలించగా అక్టోబర్‌ వరకు గురు బలం వల్ల డబ్బుకు లోటు ఉండదు. రావలసిన సొమ్ము అందుతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కాగలవు.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.  సంఘంలో పేరు ప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. అనుకున్నది సాధించేందుకు తగిన సమయం. వ్యూహాత్మకంగా సమస్యల నుంచి బయటపడతారు.  స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. అనుకూల బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, న్యాయవాదులు,  కళాకారులకు సన్మానాలు, అవార్డులు లభిస్తాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలతో ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. 

అయితే కుటుంబ క్షేత్రంలో రాహువు, అష్టమంలో కేతుసంచారం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు. మానసిక అశాంతి.  ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే, అక్టోబర్‌ 11 నుంచి షష్ఠమంలో గురు సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. సంతానరీత్యా సమస్యలు ఎదురుకావచ్చు.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

అదృష్టసంఖ్య–5

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces