పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Leo

సింహం

వీరికి  జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. సెప్టెంబర్‌ వరకు గురు బలం విశేషం. మొత్తం మీద వీరికి కొంత కాలం సామాన్య స్థితి ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. అలాగే, సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.  మీ ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు చేయూతనిస్తారు. వివాహయత్నాలు సఫలమవుతాయి. వ్యవహారాలు క్రమేపీ పూర్తి కాగలవు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత మేరకు పరిష్కారమవుతాయి. అక్టోబర్‌ నుంచి వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. జూన్‌–నవంబర్‌ మధ్య కాలంలో ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురుకావచ్చు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. శాస్త్ర,సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం, పరిశోధనల్లో విజయాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. రాజకీయవర్గాలకు జూన్‌ లోగా పదవీ యోగం. కళాకారులకు కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.  విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. చైత్రం, జ్యేష్ఠ, శ్రావణం, మార్గశిర, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, రుద్రాభిషేకాలు చేయించుకోవాలి.

అదృష్ట సంఖ్య–1

ఆది, మంగళ, గురు, శనివారాలు అనుకూలం.

ఆదాయం–14, వ్యయం–2

రాజపూజ్యం–1, అవమానం–7

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces