Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Leo

సింహం

రాశి వారికి గురువు ఏప్రిల్‌ 22వరకు పంచమ స్థానం ధనుస్సులోనూ, తదుపరి  వృశ్చిక రాశిలో ప్రవేశించి నవంబర్‌ 4వరకు చతుర్ధంలో  సంచారం. తదుపరి పంచమస్థానమైన ధనుస్సురాశిలో సంవత్సరాంతం వరకూ సంచారం.

శని  జనవరి 24వరకు పంచమ స్థానమైన ధనుస్సు రాశిలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ షష్ఠమ స్థానం మకరరాశిలో సంచారం. రాహువు లాభం, కేతువు పంచమ స్థానాలలో సంచారం.

వీరికి గురు బలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శని బలం అధికం.

ఆర్థికంగా మరింత బలం చేకూరి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది.

అనుకున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పూర్తి చేసి విజయం వైపు సాగుతారు.

బంధువర్గంతో విభేదాలు, మనస్పర్థలు తొలగుతాయి.

మీ పై వచ్చిన అపవాదులు, విమర్శలు తొలగుతాయి.

భక్తిభావాలు పెరుగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.

నూతన గృహ, భూయోగాలు కలుగుతాయి.

సంతానం వివాహ, ఉద్యోగయత్నాలు సఫలీకృతమై  ఉత్సాహంతో సాగుతారు.

ద్వితీయార్థంలో శారీరక రుగ్మతలతో బాధపడతారు.

కుటుంబంలో ఒత్తిడులు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు.

శుభకార్యాలు, ఇతర వేడుకలతో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది.

కాంట్రాక్టర్లకు అనూహ్యమైన విధంగా టెండర్లు దక్కుతాయి.

వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులతో సంస్థలను విస్తరిస్తారు. భాగస్వాముల అన్వేషణలో సఫలమవుతారు.

ఉద్యోగాలలో మరిన్ని మార్పులకు అవకాశం. ఉన్నతవర్గాల చేయూత అందుతుంది.

పారిశ్రామికవేత్తలు అనుకున్న ప్రగతితో ముందడుగు వేస్తారు. ప్రభుత్వంతో వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.

రాజకీయవేత్తలను పదవులు వరిస్తాయి. విశేష ప్రజాదరణతో ముందుకు సాగుతారు.

కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.

క్రీడాకారులు ప్రతిభను చాటుకుంటారు. అవార్డులు సైతం దక్కించుకుంటారు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం.

ఆదాయం–8, వ్యయం–14, రాజపూజ్యం–1, అవమానం –5.

వీరు శివాభిషేకాలు జరిపిస్తే మంచిది.

చైత్రం, వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలమైనవి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces