పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Libra

తుల

వీరికి అక్టోబర్‌ నుంచి ఏల్నాటి శని ప్రభావం పూర్తిగా తొలగుతుంది. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని వక్రగతిన  వృశ్చిక రాశిలో సంచారం కొంత దోషకారకమైనా ప్రభావం అంతగా ఉండదు. ఈ ఏడాదంతా గురువు దోషకారే. ఇక రాహువు ఆగస్టు వరకు శుభుడు. మొత్తం మీద చాలావరకూ అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలమైనా అవసరాలరీత్యా రుణాలు చేయాల్సి వస్తుంది. అలాగే, ఖర్చులు కూడా పెరుగుతాయి.  ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కారమయ్యే  అవకాశం ఉంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహన, గృహ యోగాలు కలుగుతాయి. కొన్ని ఒప్పందాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతులు సంభవం. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. మొదటి పంట మరింత లాభిస్తుంది. శాస్త్రసాంకేతిక రంగాల వారు పరిశోధనల్లో సాధించిన విజయాలు మరుపురానివిగా ఉంటాయి. జూన్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో శని ధన స్థానంలో సంచారం వల్ల ఆరోగ్య, కుటుంబ సమస్యలు. వృథా ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థికంగా హామీలు వద్దు.వివాదాలకు దూరంగా ఉండండి. జ్యేష్ఠం, భాద్రపదం, కార్తీకం, పుష్యం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శని, గురునికి పరిహారాలు చేయించుకోవాలి. శివాలయంలో అభిషేకాలు చేయించుకోవాలి.

అదృష్ట సంఖ్య 6, సోమ, బుధ

శుక్రవారాలు అనుకూలం.

ఆదాయం–14, వ్యయం–11

రాజ పూజ్యం–7, అవమానం–7

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces