Yearly moonsign horoscope
18th March, 2018 to 05th April, 2019
Libra
తుల
ఆదాయం–11, వ్యయం –5, రాజపూజ్యం–1, అవమానం–2.
వీరి శనిబలం విశేషం. గురుబలం అక్టోబర్ వరకు లేదు. ఇక దశమంలో రాహువు, అర్థాష్టమంలో కేతువు దోషకారులు. ఈ రీత్యా చూస్తే వీరికి ఆదాయం కనిపించినా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యయప్రయాసలు అధికం. బంధువర్గంతో తరచూ వివాదాలు. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని వ్యవహారాలు మీ చొరవతో పూర్తి కాగలవు. ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు తీరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు దక్కినా సంతృప్తి ఉండదు. వ్యవసాయదారులకు రెండు పంటలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడులు. ఉన్నా కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయనాయకులకు విశేషంగా కలసివస్తుంది. కళాకారులు, శాస్త్రసాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు. మీపై విమర్శలకు ప్రత్యర్థులు సిద్ధంగా ఉంటారు, అప్రమత్తంగా మెలగాలి.
ఇక అక్టోబర్ 11 నుంచి గురుబలం పెరుగుతుంది. అప్పటి నుంచి మరింత ధనాదాయం లభిస్తుంది. విశేష గౌరవమర్యాదలు పొందుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం. శుభకార్యాల నిర్వహణ. తీర్థయాత్రలు చేస్తారు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.
అదృష్ట సంఖ్య–6