Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Libra

తుల

వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌ 22 వరకు తృతీయమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌ 4వరకు ద్వితీయమైన వృశ్చికంలోను, తదుపరి సంవత్సరాంతం వరకు తతీయమైన ధనుస్సులో సంచారం.

శని జనవరి 24వరకు తృతీయమైన ధనుస్సులోనూ, తదుపరి అర్థాష్ఠమమైన మకర రాశిలో సంచారం. రాహువు సంవత్సరమంతా భాగ్యస్థానమైన మిథునం, కేతువు తృతీయమైన ధనుస్సులో సంచారం.

వీరికి ఏప్రిల్‌ 22 నుంచి నవంబర్‌ వరకు గురు బలం , సంవత్సరమంతా శని, రాహుకేతువుల బలం విశేషం. జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రారంభమవుతుంది.

ఈ రీత్యా చూస్తే వీరికి  జనవరి వరకూ అన్నీ శుభదాయకంగానే ఉంటుంది. జ్ఞానాన్ని మరింత పెంచుకుంటారు.

ఆధ్యాత్మికంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతారు.

మీ భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు.

అవివాహితులకు వివాహ యోగం కలిగే సూచనలు.

ఆర్థికపరంగా మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రెండుమూడు విధాలుగా ధన లాభాలు కలుగుతాయి.

ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు కలసి వస్తాయి.

మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయుక్తమైనవిగా ఉంటాయి.

ఇంటి నిర్మాణాలు ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో అనుకూలిస్తాయి. ఊహించని రీతిలో భూములు కొనుగోలు చేస్తారు.

తండ్రి తరఫువారితో విభేదాలు పరిష్కరించుకుంటారు.

కొన్నేళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న కేసు ఒకటి పరిష్కారమవుతుంది.

వ్యాపారులకు పట్టింది బంగారమే. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాలు తథ్యం.

ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరటనిస్తాయి. ఉన్నతాధికారులు మీపట్ల మరింత సానుకూలత చూపడం విశేషం.

పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధిస్తారు. కొత్త కంపెనీల ప్రారంభంలో ఆటంకాలు తొలగుతాయి.

రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. అలాగే, ప్రజాదరణలో లోటు ఉండదు.

సినీ,టీవీ కళాకారులు అవార్డులు పొందుతారు. ప్రతిభను చాటుకుని కొత్త అవకాశాలు సాధిస్తారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి.

మహిళలు అన్ని రంగాలలోనూ విశేషంగా రాణిస్తారు.

జనవరి 24 నుంచి అర్థాష్టమ శని ప్రభావంతో పాటు, నవంబర్‌ నుంచి గురుబలం తగ్గిన కారణంగా శారీరక రుగ్మతలు, ఇతరులతో మాటపడాల్సి పరిస్థితులు. మానసిక అధైర్యం. తరచూ ఇంటాబయటా విభేదాలు వంటి ఫలితాలు ఉంటాయి.

ఆదాయం–8, వ్యయం–8, రాజపూజ్యం–7, అవమానం–1

వీరు అర్థాష్టమశని దోష నివారణకు శనీశ్వరుని తైలాభిషేకాలు జరిపించుకోవాలి. అలాగే, నవంబర్‌ నుంచి గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకోవాలి.

చైత్రం, శ్రావణం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces