పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Pisces

మీనం

ఈ రాశి వారికి సెప్టెంబర్‌ వరకు గురువు యోగకారకుడు, తదుపరి సంవత్సరమంతా అష్టమ రాశి సంచారం. శని, రాహువులు అంతగా అనుకూలం కాదు. మొత్తంమీద వీరికి మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా శ్రమానంతరం పూర్తి కాగలదు.  ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి.  రుణదాతల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. సెప్టెంబర్‌ నుంచి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు, ఆహార విహారాదులలో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువు మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. అయితే మనోనిబ్బరంతో ముందుకు సాగి అధిగమిస్తారు. చిరకాల ప్రత్యర్థులు సహాయపడడం విశేషం.  శుభకార్యాల నిర్వహణ పై నిర్ణయాలు తీసుకుంటారు.  నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు శ్రమానంతరం ఫలిస్తాయి. కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్రారంభంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా పై స్థాయి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి.  పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు. కళాకారులకు జయాపజయాలు సమానంగా ఉంటాయి. విద్యార్థులకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యవసాయదారులు మొదటి పంటలో లాభాలు పొందుతారు. వైశాఖం, శ్రావణం, కార్తీకం, ఫాల్గుణ మాసం  అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు గురునికి పరిహారాలు, రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది.

అదృష్ట సంఖ్య–3,

ఆది, మంగళ, గురు వారాలు కలసి వస్తాయి.

ఆదాయం–8 వ్యయం–11

రాజ పూజ్యం–1, అవమానం–2

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces