Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Pisces

మీనం

రాశి వారికి గురువు ఏప్రిల్‌22వరకు దశమంలోనూ, తదుపరి నవంబర్‌4వరకు భాగ్యస్థానమైన వృశ్చికంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకూ దశమమైన ధనుస్సులోనూ సంచారం.

శని జనవరి 23వరకు రాజ్యస్థానమైన ధనుస్సులోనూ, తదుపరి లాభస్థానమైన మకర రాశిలో సంచారం. రాహువు సంవత్సరాంతం వరకూ అర్థాష్టమైన మిథునం, కేతువు దశమమైన ధనుస్సు రాశిలో సంచారం.

వీరికి గురు బలం విశేషం. అలాగే, సంవత్సరాంతంలో శని విశేష లాభదాయకుడు. అయితే రాహుకేతువులు దోషకారులు. మొత్తం మీద వీరికి శుభదాయకంగా ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కొన్ని సందర్భాల్లో వద్దంటే డబ్బు అన్నట్లుంటుంది. అయితే ఏదోవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.

వివాహయత్నాలు కలసివచ్చి ఊరట చెందుతారు.

సంతాన, కుటుంబ సౌఖ్యం. సంతానం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అలాగే, ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.

బంధువులు, మిత్రులు మీకు వెన్నంటి నిలిచి మీ విజయాలలో భాగస్వాములవుతారు.

కాంట్రాక్టర్లు అనుకున్న దానికంటే అధికంగా లాభాలు పొందుతారు.

తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. అలాగే, ధార్మిక కార్యక్రమాలను చేపడతారు.

వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. నూతన భాగస్వాములు చేరతారు.

ఉద్యోగస్తులకు విశేష గుర్తిపు లభిస్తుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలమవుతాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటులో విజయం.

రాజకీయవేత్తలను అనుకోని పదవులు వరిస్తాయి. సన్మానాలు, పురస్కారాలు.

సినీ, టీవీ కళాకారులు గతం కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విశేష గుర్తింపు, ప్రోత్సాహం అందుతాయి.

క్రీడాకారులు, పరిశోధకులు, వైద్యులు తమ సత్తా నిరూపించుకుంటారు.

విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు.

వ్యవసాయదారులు రెండుపంటలూ లాభించి ఉత్సాహంగా గడుపుతారు.

అర్థాష్టమ రాహువు కారణంగా తరచూ శారీరక రుగ్మతలు, మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు నెలకొనవచ్చు. అయినవారి నుంచే అవమానాలు ఎదురవుతాయి.

ఆదాయం–2, వ్యయం–8, రాజపూజ్యం–1, అవమానం–7.

వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.

అలాగే, దుర్గామాతకు కుంకుమార్చనలు,

సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు మంచిది.

చైత్రం, వైశాఖం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, మాఘం మాసాలు మరింత అనుకూలమైనవి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces