పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Sagittarius

ధనుస్సు

శని, రాహు ప్రభావాలు వీరి పై అధికంగా ఉన్నా గురువు యోగదాయకుడైనందున లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఖర్చులు పెరిగినా అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి అపవాదులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కుటుంబంలో చికాకులు కాస్త తప్పక పోవచ్చు. చేపట్టిన కార్యాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. శని ప్రభావం వల్ల తరచూ బంధువర్గంతో విభేదాలు నెలకొంటాయి.  అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఉదర, నేత్ర,నరాలకు సంబంధించిన రుగ్మతలు బాధిస్తాయి. కాంట్రాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది. అయితే గురుని శుభత్వం వల్ల అవరోధాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు సెప్టెంబర్‌నుంచి అనుకూలిస్తుంది.  వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా మంచి గుర్తింపు రాగలదు. అయితే సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు.  పారిశ్రామికవర్గాలకు  ప్రభుత్వపరంగా కొంతమేరకు సహాయం అందుతుంది. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు ద్వితీయార్థంలో దక్కుతాయి. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూలస్థితి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.

వీరు శని, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, అమ్మవారికి కుంకుమార్చన మంచిది. శివ పంచాక్షరి పఠించండి.

అదృష్ట సంఖ్య–3, ఆది

బుధ, శుక్ర, శనివారాలు అనుకూలం.

ఆదాయం–8, వ్యయం–11

రాజపూజ్యం–6, అవమానం–3.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces