Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Sagittarius

ధనుస్సు

ఆదాయం–5 వ్యయం – 5, రాజపూజ్యం–1, అవమానం–5.

వీరికి గురుబలం విశేషం. జన్మరాశిలో శని సంచారం, అష్టమ రాహువు దోషకారకం.

అనుకున్న ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. శుభమూలక ఖర్చులు అధికంగా ఉంటాయి.  అక్టోబర్‌ వరకు గురుబలం ఉన్నందున కార్యజయం.  ఆకస్మిక ధన లాభాలు. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు, ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు.  తరచూ తీర్థ యాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండదు.  మనోవ్యాకులత. ఆరోగ్యం పై మరింత శ్రద్ధ చూపండి.  వ్యాపారస్తులు, వాణిజ్యవర్గాలకు ఒడిదుడుకులు. అనుకున్న పెట్టుబడులు సమకూరక సతమతమవుతారు. ఉద్యోగులు ఆకస్మిక బదిలీలకు సిద్ధపడాలి. పై స్థాయి అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి నిరాశానిస్పృహలు. శ్రమ వృథా కాగలదు. వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది.  క్రీడాకారులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. రాజకీయనేతలకు ఒత్తిడులు పెరుగుతాయి. న్యాయవాదులు, కళాకారులకు ప్రారంభంలో శుభదాయకంగా ఉంటుంది. తదుపరి చిక్కులు ఎదురుకావచ్చు. మొత్తం మీద ఈరాశి వారికి సామాన్యంగానే ఉంటుంది.

అదృష్ట సంఖ్య–3

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces