Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Sagittarius

ధనుస్సు

రాశి వారికి గురువు ఏప్రిల్‌ 22వరకు జన్మరాశిలోనూ, తదుపరి నవంబర్‌ 4వరకు వ్యయస్థానమైన వృశ్చి కరాశిలో సంచరించి తదుపరి   సంవత్సరాంతం వరకు జన్మరాశిలో సంచారం.

శని జనవరి 24వరకు జన్మరాశిలోనూ తదుపరి ద్వితీయమైన మకరరాశిలో సంచారం. రాహువు సప్తమమైన మిథునం, కేతువు జన్మరాశిలో సంచారం.

గ్రహ స్థితి పరిశీలించగా, వీరికి ఏల్నాటిశనితో పాటు, గురుని వ్యయ, జన్మరాశిలో సంచారం, రాహువు సప్తమం, కేతువు జన్మరాశిలో సంచారం కారణంగా అన్ని విషయాలలోనూ జాగరూకతతో మెలగాలి.

అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి.

అనుకున్న సమయానికి డబ్బు అందక తరచూ ఇబ్బందులు పడతారు. ఆస్తుల క్రయవిక్రయాలు కూడా అంతగా లాభించవు. అనుకున్నంత ఆదాయం లేక రుణాలు చేయాల్సిన పరిస్థితి. లేనిపోని ఖర్చులు కూడా పెరుగుతాయి.

బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి.

శారీరక రుగ్మతలు, మనోక్లేశాలు బాధిస్తాయి. ఆస్పత్రులు సందర్శిస్తారు.

తల్లిదండ్రుల తరఫు వారి నుంచి సమస్యలు ఎదురుకావచ్చు.

అవివాహితులకు శ్రమానంతరం వివాహాలు జరుగుతాయి.

వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఆశించినంత ప్రగతి కనిపించదు.

ఉద్యోగులు తరచూ మార్పులు పొందుతారు. మీ పట్ల కొంత వ్యతిరేకత ఉంటుంది.

పారిశ్రామికవేత్తలు ప్రణాళికలు కార్యరూపం దాల్చక నిరాశ చెందుతారు.

రాజకీయవేత్తలకు అతికష్టం మీద కొంత అనుకూలత ఉంటుంది. పదవులు చేజారవచ్చు.

విద్యార్థులు మరింత శ్రమపడాలి. సామాన్య ఫలితాలు సాధిస్తారు.

కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది.

ఆదాయం –2, వ్యయం–8, రాజపూజ్యం–6, అవమానం–1.

వీరు శని, రాహుకేతువులు, గురునికి విశేషంగా పరిహారాలు చేయించుకోవాలి. అను నిత్యం దైవారాధన మంచిది.

చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces