Yearly moonsign horoscope
06th April, 2019 to 24th March, 2020
Scorpio
వృశ్చికం
వీరికి గురువు ఏప్రిల్ 22వరకు ద్వితీయమైన ధనుస్సురాశిలోనూ, తదుపరి నవంబర్ 4వరకు జన్మరాశిలో సంచరించి తిరిగి ద్వితీయమైన ధనుస్సులో ప్రవేశించి సంవత్సరాంతం వరకూ సంచరిస్తాడు.
శని జనవరి 24వరకు ద్వితీయమైన ధనుస్సులోనూ, తదుపరి తృతీయమైన మకర రాశిలో సంచారం. రాహువు ఏడాదంతా అష్టమమైన మిథునం, కేతువు ద్వితీయమైన ధనుస్సు రాశిలో సంచారం.
వీరికి గురు బలం కొంతవరకూ ఉంది. జనవరి వరకూ ఏల్నాటి శని ప్రభావంతో పాటు, సంవత్సరమంతా అష్టమ రాహువు, ద్వితీయంలో కేతు సంచారం ప్రతికూలం.
ఈరీత్యా చూస్తే మొత్తం మీద గురుబలం మీద కొంతవరకూ నెట్టుకొస్తారు.
తరచూ శారీరక సంబంధిత రుగ్మతలు బాధపెట్టవచ్చు. అష్టమ రాహువు ప్రభావం వల్ల వాహనాలు నడిపే వారు అత్యంత జాగరూకతతో మసలు కోవాలి. అలాగే, కొందరికి శస్త్ర చికిత్సలు జరుగవచ్చు.
ఏపనిపైనా శ్రద్ధ ఉండదు, మీ ఆలోచనలు నిలకడగా సాగవు.
కుటుంబ సభ్యులతో వైరం. వారి విధానాలను వ్యతిరేకించడం ద్వారా కొంత ఎడబాటు ఉండవచ్చు.
మొత్తం మీద వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
వివాహ యత్నాలు కలసి వస్తాయి.
వ్యాపారులు లాభాలు కనిపిస్తాయి. నూతన పెట్టుబడుల అన్వేషణలో విజయం సాధిస్తారు.
ఉద్యోగులు పనితీరు మెరుగుపర్చుకుని ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.
పారిశ్రామికవేత్తలకు తరచూ విదేశీ పర్యటనలు. ప్రభుత్వంలో చర్చలు ఉంటాయి.
రాజకీయవేత్తలకు పదవులు ఊరిస్తుంటాయి.
కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలిస్తుంది.
క్రీడాకారులు, పరిశోధకులు, టెక్నాలజీ రంగాల వారు మరింత గుర్తింపు పొందుతారు.
ఆదాయం –14, వ్యయం–14, రాజ పూజ్యం–3, అవమానం–1.
శనికి తైలాభిషేకాలు,
రాహుదోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు,
ఈశ్వరారాధన మంచిది.
వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, కార్తీకం, మార్గశిరం, పుష్యమాసాలు అనుకూలం.