పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Yearly moonsign horoscope

29th March, 2017 to 17th March, 2018

Taurus

వృషభం

ఈ రాశి వారికి ఆదాయవ్యయాలు, రాజపూజ్యాదులు బాగున్నా గ్రహ సంచారం రీత్యా కొన్ని ఇబ్బందులు తప్పక పోవచ్చు. జనవరి నుంచి జూన్‌వరకు, తిరిగి అక్టోబర్‌26నుంచి సంవత్సరాంతం వరకూ అష్టమ శని, ఆగస్టు 17వరకు అర్థాష్టమ రాహు ప్రభావాలు అధికం. అయితే సెప్టెంబర్‌ వరకు గురు బలం వల్ల కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద వీరికి  లేనిపోని చికాకులు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా నరాలు, నేత్రం, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

ఆగస్టు నుంచి రాహు దోషం తొలగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణ దాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

 కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించడమే కాకుండా సభ్యులతో కలహాలు ఏర్పడతాయి. బంధువులు మీ పై అపవాదులు, నిందలు మోపుతారు.

వాహనాలు నడిపే వారు మెలకువ పాటించాలి.  చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. శాస్త్ర, సాంకేతికరంగాల వారికి కార్తీకం, మార్గశిర మాసాల్లో విశేష గుర్తింపు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఆగస్టు తర్వాత ఫలించే సూచనలు. ఇంటి నిర్మాణ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల కోసం కొంత శ్రమించాలి. కొద్దిపాటి లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఊహించని బదిలీలు ఉంటాయి. విధుల్లో అవాంతరాలు ఎదురు కావచ్చు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. సంవత్సరాంతంలో పదవీయోగం. కళాకారులకు శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. వ్యవసాయదారులకు సామాన్య స్థితి. రెండవ పంట కొంత అనుకూలిస్తుంది. జ్యేష్టం, శ్రావణం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. 

వీరు శని, రాహువులకు పరిహారాలు చేయాలి. శివునికి, ఆంజనేయస్వామికి పూజలు ఫలితాన్నిస్తాయి.

అదృష్ట సంఖ్య–6 

బుధ, శనివారాలు అనుకూలం.

ఆదాయం– 14, వ్యయం–11

రాజపూజ్యం– 6 అవమానం–1

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces