Yearly moonsign horoscope

18th March, 2018 to 05th April, 2019

Taurus

వృషభం

ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–1, అవమానం–3

వీరికి అక్టోబర్‌వరకు గురుబలం లేదు. అలాగే, అష్టమశని ప్రభావం అధికం. మార్చి వరకు రాహువు అనుకూలుడు. 

ఈరీత్యా చూస్తే వీరు ప్రతి విషయంలోనూ  అప్రమత్తంగా ఉండడం మంచిది. మంచికి వెళ్లినా చెడుగా మారవచ్చు. సమస్యలు చుట్టుముట్టి సతమతం చేస్తాయి. వీటిని అధిగమించేందుకు మరింత కష్టించాలి. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగుతో అకారణంగా విభేదాలు. స్థిరాస్తి విషయంలో జ్ఞాతులతో వివాదాలు నెలకొంటాయి.  మీరు తీసుకునే నిర్ణయాల పై వ్యతిరేకత రావడంతో  మనస్తాపం చెందుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.  అయితే రాహువు అనుకూల సంచారంతో మధ్యమధ్యలో కొంత అనుకూలత ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. రాబడి ఎంతగా లభించినా ఖర్చులు కూడా మీదపడతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు కనిపించవు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒత్తిడులు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. చలనచిత్ర, నాటకరంగాల వారికి అవకాశాలు అంతగా కనిపించవు. క్రీడాకారులకు నిరుత్సాహం. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కాగా

అక్టోబర్‌ 11 నుంచి గురుబలం వల్ల కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  ఆర్థిక ప్రగతి. కార్యజయం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తిలాభం. అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. వీరు శని, గురులకు పరిహారాలు చేయించుకోవాలి.

అదృష్టసంఖ్య–6

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces