Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Taurus

వృషభం

రాశి వారికి గురువు ఏప్రిల్‌ 22వరకు అష్టమ స్థానం (8వ ఇంట) ధనుస్సు రాశిలోనూ, తదుపరి 7వ ఇంట వృశ్చిక రాశిలో ప్రవేశించి నవంబర్‌ 4వరకు సంచారం. అనంతరం 8వ ఇంట ధనుస్సు రాశిలో సంచారం.

శని సంవత్సరాది నుండి జనవరి 24వరకు  అష్టమ స్థానం ధనుస్సురాశిలో సంచారం, తదుపరి భాగ్య స్థానం మకర రాశిలో  సంచారం. ఇక రాహువు ద్వితీయం, కేతువు అష్టమంలోనూ సంచారం.

వీరికి ఈ ఏడాది మధ్య కాలంలో కొంతవరకూ అనుకూల వాతావరణం ఉంటుంది.

అష్టమ శని, గురుని ప్రభావంతో ఈతి బాధలు ఎదుర్కొంటారు.

తరచూ మానసిక ఆందోళన.

ఆర్థికంగా కొంత నిలదొక్కుకునే సమయానికి ఏదో అవసరం వచ్చి మళ్లీ అప్పులు చేస్తారు.

రుణ దాతలు ఒత్తిడులు మరింత పెంచుతారు.

బంధు మిత్రుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.

ప్రత్యర్థుల విషయంలో తీసుకునే నిర్ణయాల పై  ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

గృహం, ఆభరణాలు, భూములు కొనుగోలు చేసే యత్నాలు ద్వితీయార్ధంలో నెరవేరే సూచనలున్నాయి.

నిరుద్యోగులకు ద్వితీయార్ధంలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు.

విద్యార్థులు లక్ష్య సాధనలో మరింతగా శ్రమించాల్సి ఉంటుంది, అయితే ఏప్రిల్‌ నుంచి గురు బలం కారణంగా అనుకున్న విద్యావకాశాలు దక్కుతాయి.

రాజకీయ నాయకులకు అరుదైన కొన్ని అవకాశాలు మధ్యలో దక్కుతాయి.

వ్యాపారులకు లాభాలు అందీఅందనట్లుగా కనిపిస్తాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాముల సమీకరణలో శ్రమపడాలి.

ఉద్యోగులకు ఆకస్మిక  బదిలీలు ఉండవచ్చు, కొన్ని బాధ్యతలు మీద వేసుకుని తరువాత చింతిస్తారు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు ఊహించిన దానికంటె మెరుగైన ఫలితాలు పొందుతారు. అయితే శ్రమ తప్పక పోవచ్చు.

కళాకారులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగించినా క్రమేపీ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటె రెండవ పంట లాభసాటిగా ఉంటుంది.

కుటుంబ, వృత్తిపరమైన చికాకులు తప్పకపోవచ్చు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో మరింత అప్రమత్తత అవసరం.

ఆదాయం– 8 వ్యయం–8, రాజ్యపూజ్యం–6, అవమానం–6

వీరు గురు, శని గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.

దుర్గామాతకు ప్రత్యేకంగా కుంకుమార్చనలు చేయించాలి.

చైత్రం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces