Yearly moonsign horoscope

06th April, 2019 to 24th March, 2020

Virgo

కన్య

వీరికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్‌ 22వరకు చతుర్ధమైన ధనుస్సులోనూ, తదుపరి నవంబర్‌ 4వరకు తృతీయమైన వృశ్చికంలోనూ, తదుపరి సంవత్సరాంతం వరకు చతుర్ధమైన ధనుస్సురాశిలో సంచారం.

ఇక శని జనవరి 24వరకు అర్థాష్టమ స్థానమైన ధనుస్సులోనూ, తదుపరి పంచమ స్థానమైన మకరంలోనూ సంచారం. రాహువు దశమంలోనూ, కేతువు చతుర్ధంలోనూ సంచారం.

వీటిని పరిశీలించగా, మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. నవంబర్‌ నుంచి గురు బలం, జనవరి నుంచి శని బలం చేకూరుతుంది.

రాబడి ఉన్నా ఖర్చులు కూడా విశేషంగా పెరిగి సవాలుగా మారతాయి.

పనుల్లో ప్రతిబంధకాలు, జాప్యం తప్పకపోవచ్చు.

తరచూ ప్రయాణాలు, తద్వారా శ్రమాధిక్యం.

శారీరక రుగ్మతలు, ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

ప్రతి విషయంలోనూ ఆందోళన చెందుతారు.

బంధువుల చేయూతతో  కొన్ని కార్యక్రమాలు మధ్యమధ్యలో  పూర్తి చేస్తారు.

ఆర్థిక పరమైన హామీలకు దూరంగా ఉండండి.

వ్యాపారులకు కొంత వరకూ లాభాలు దక్కుతాయి. కొత్త భాగస్వాముల చేరికలో కొంత జాప్యం.

ఉద్యోగస్తులు అనుకోని మార్పులు జరిగి కొంత అసహనంతో గడుపుతారు. అలాగే, విధులు మరింతగా పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలకు ద్వితీయార్థంలో కొంత అనుకూలత ఉండవచ్చు.

వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది.

విద్యార్థులకు ఫలితాలు, అవకాశాలు సంతప్తి కలిగించవు.

పరిశోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–4, అవమానం–5.

వీరు శనీశ్వరునికి తైలాభిషేకం,

రాహుకేతువుల దోష నివారణకు అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం మంచిది.

అలాగే గురుదోష నివారణకు పరిహారాలు చేయించుకుంటే మేలు.

ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces