Yearly Sunsign Horoscope
01st January, 2019 to 31st December, 2020
Aquarius
కుంభం (23 జనవరి - 22 ఫిబ్రవరి)
పట్టుదలే మీకు మేలు చేస్తుంది. అనుకున్న వ్యవహారాలు ప్రథమార్థంలో వేగంగా పూర్తి కాగలవు.
ఆలోచనలు అమలులో విజయం సాధిస్తారు.
ప్రముఖులు పరిచయమై మీకు సహాయకారులుగా నిలుస్తారు.
బంధువులు మీ పై మరింత ఆదరణ, ప్రేమ చూపుతారు.
వివాహాది వేడుకల నిర్వహణతో ద్వితీయార్థం గడుస్తుంది.
సంతానపరంగా ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.
భవిష్యత్ పై నిరుద్యోగులకు భరోసా కలుగుతుంది.
ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
వ్యాపారాలు కొత్త భాగస్వాములతో కళకళలాడతాయి. అనూహ్యమైన రీతిలో లాభాలు గడిస్తారు. విస్తరణలోనూ విజయం సాధిస్తారు.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాగలవు. సహచర ఉద్యోగులు సైతం మీమాటకు ఎదురుచెప్పరు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకుల ప్రయత్నాలు సఫలమవుతాయి.
వ్యవసాయదారులు రెండు పంటలు లాభించి ఉత్సాహంగా గడుపుతారు.
మహిళలకు సమస్యలు తీరతాయి.
జనవరి, మార్చి, మే, ఆగస్టు, సెప్టెంబర్ ప్రతికూల ప్రభావం చూపుతాయి. తరచూ నిర్ణయాలలో మార్పులు, వాహనాలు విషయంలోనూ, ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తలు అవసరం.
అదృష్ట సంఖ్య–8
నలుపు, చాక్లెట్, పసుపు రంగులు అనుకూలం.
నిత్యం దుర్గా అమ్మవారిని మరియు సూర్యభగవానుణ్ణి పుజించడం మంచిది